గుండెపోటుతో ఉపాధివేతనదారు మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉపాధివేతనదారు మృతి

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

వంగర: మండల పరిధి మడ్డువలస గ్రామానికి చెందిన ఉపాధి హామీ వేతనదారు తివనాన శంకరరావు (62) మంగళవారం మృతిచెందాడు. గ్రామ సమీపంలో గూడచెరువు వద్ద వీబీజీ రాంజీ పథకంలో భాగంగా జంగిల్‌ తొలగింపు పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయాడు. సహచర వేతనదారులు సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందుబాటులో ఉన్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు వచ్చి తనిఖీ చేసి అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. అక్కడే పనులు చేస్తున్న మృతుని భార్య కృష్ణవేణి, సహచర వేతనదారులు రోదించారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఎలక్ట్రికల్‌ స్కూటీ దగ్ధం

● షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

పార్వతీపురం రూరల్‌: పట్టణంలోని కొత్తవలస మొండి వీధిలో రోడ్డుపై పార్కింగ్‌ చేసి ఉన్న ఎలక్ట్రికల్‌ స్కూటీ మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు ఎలా చెలరేగాయన్న విషయంపై స్థానికులు వివరాలు తెలిపారు. మొండి వీధిలో నిలిపి ఉంచిన ఎలక్ట్రికల్‌ స్కూటీ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై కాలిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఇటీవల ఇలా అనేక సందర్భాల్లో ఎలక్ట్రికల్‌ స్కూటీలు కాలిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్‌ వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వీధి కుక్కల దాడిలో

వృద్ధురాలికి తీవ్రగాయాలు

మెంటాడ: వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతోంది. మెంటాడ మండలంలోని పెద మేడపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కిలపర్తి సింహచలం(76) గ్రామంలోని తన ఇంటి ముందు ఉదయం ఉండగా గ్రామంలోని వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో కుటుంబసభ్యులు గమనించి వెంటనే గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది. ఈ సంఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement