పంచాయతీ పోరుకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ పోరుకు పటిష్ట బందోబస్తు

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

● 8 మండలాల్లో నిఘా నీడలో తొలి విడత పోలింగ్‌

● ఎస్పీ ఎస్వీ మాధవ్‌ రెడ్డి

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో ఈ నెల 26న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలీస్‌ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనీల్‌ చంద్ర పునేఠా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల బందోబస్తు వివరాలను వెల్లడిస్తూ, మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, ఎల్విన్‌పేట మండలాల్లో తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందే మైకులు, ఊరేగింపులను నిలిపివేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే రూట్‌ మార్చ్‌లు నిర్వహించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్‌ ముగిసే వరకు పూర్తి స్థాయి నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను రంగంలోకి దించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.అంతకుముందు జరిగిన వర్చువల్‌ సమీక్షలో ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా మాట్లాడుతూ, బెదిరింపులకు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రత, మౌలిక సదుపాయాలపై దిశానిర్దేశం చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే వెంటనే పోలీసులకు లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 112కు సమాచారం అందించాలని ఎస్పీ మాధవ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement