తొలిరోజు 8 నామినేషన్ల దాఖలు | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు 8 నామినేషన్ల దాఖలు

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

మొదటి రోజు నామినేషన్లు నిల్‌

సాలూరులో 6 నామినేషన్లు

● మున్సిపల్‌ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి

● నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్చిత్‌

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ నుంచి 7, సీపీఎం నుంచి ఒక నామినేషన్‌ నమోదైంది. అలాగే, చైర్‌పర్సన్‌ స్థానానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ నుంచి ఒక నామినేషన్‌ దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్చిత్‌ రహార్‌ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పార్వతీపురంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. కేంద్రాల వద్ద గందరగోళం తలెత్తకుండా మున్సిపల్‌ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో ముగిసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

పాలకొండ: పాలకొండ నగరపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలిరోజు శుక్రవారం ఒక్క నామినేషన్‌ కూడా దాఖాలు కాలేదు. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల కౌంటర్లను డీఎస్పీ ఎం.రాంబాబు, కమిషనర్‌ నూకరాజు, తహసీల్దార్‌ రాధాకృష్ణమూర్తి పర్యవేక్షించారు.

సాలూరు రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లలో భాగంగా తొలిజు కౌన్సిల్‌ అభ్యర్థులుగా 5 నామినేషన్లు దాఖలు కాగా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా 1నామినేషన్‌ దాఖలైంది. దీనిపై మున్సిపల్‌ ఎన్నికల అధికారి తెలిపిన వివరాల ప్రకారం 8 వ వార్డునుంచి ఇద్దరు నామినేషన్లు వేయగా 12 వ వార్డునుంచి 1. 20 వ వార్డు నుంచి 2 నామినేషన్లు వేశారు. అలాగే చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా భవిరెడ్డి రిబ్కా రాణి 25 వ వార్డునుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement