● సాలూరు మున్సిపాలిటీ జనసేనకు కేటాయింపు
● తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి
సాలూరు రూరల్: కూటమి పొత్తుల్లో భాగంగా సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీకి కాకుండా జనసేనకు కేటాయించడంతో మంత్రి సంధ్యారాణి కంటతడిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పార్వతీపుం మన్యం జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యరు. ఈ సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పట్టణంలో బలం లేని చోట జనసేన పార్టీకి చైర్పర్సన్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టడంతో తెలుదేశం కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 వేల ఓట్లకు పైగా మెజారిటీ ఇచ్చిన మున్సిపాలిటీని జనసేనకు అప్పజెప్పడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం కూడా జనసేనకు కేటాయించారన్నారు.
మా అండతో గెలిచి చిన్న చూపా?
జనసేన అండతో, కష్టంతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు సీట్లు ఇచ్చే సరికి కష్టంగా అనిపిస్తుందా అని జనసేన కార్యకర్తలు మండి పడుతున్నారు.. మంత్రి మాటలకు జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


