● బార్బర్ షాపులోకి దూసుకెళ్లిన
పెళ్లి బస్సు
బొండపల్లి: వేగంగా వస్తున్న పెళ్లి బస్సు అదుపు తప్పి మండలంలోని బిల్లలవలస జంక్షన్ వద్ద జాతీయ రహదారి26 పక్కన గల బార్బర్ షాపులోకి దూసుకెళ్లింది. సోమవారం వేకువ జామున నాలుగు గంటలకు జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సింహాచలానికి చెందిన పెళ్లి బృందం సాలూరులో జరుగుతున్న పెళ్లికి బస్సులో హాజరై పెళ్లి తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా సాలూరు నుంచి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ జంక్షన్ వద్దకు వచ్చే సరికి డ్రైవర్ బస్సును వేగంగా నడపడంతో అదుపు తప్పి ఒక్కసారిగా జాతీయ రహదారిని అనుకుని ఉన్న బార్బర్ షాపులోకి బస్సు దూసుకు వెళ్లడంతో షాపు తుక్కు తుక్కు కావడంతో పాటు బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో డైవర్‌కు గాయాయ్యాయి. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది పెళ్లి బృందం సభ్యులు సురక్షితంగా బయట పడ్డారు. బస్సును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులు అన్ని కోణాల్లో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆ బస్సు విశాఖ జిల్లాలోని పధ్మనాభం మండలానికి చెందినదిగా తెలిసింది.


