కూటమి అండతోనే జర్నలిస్ట్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

కూటమి అండతోనే జర్నలిస్ట్‌పై దాడి

Aug 25 2026 1:03 AM | Updated on Aug 25 2026 1:03 AM

విజయనగరం గంటస్తంభం:

కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమాలు వెలికితీస్తున్నాడనే అక్కసుతో పూసపాటిరేగ విశాలాంధ్ర విలేకరి గోవింద్‌పై కూటమి నాయకులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, వామపక్ష, విపక్ష నేతలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దాడి గురించి మాట్లాడేందుకు ఎస్పీని సంప్రదించాలని ప్రయత్నిస్తున్నా కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితేమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నిరసనలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పీఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు వి.మహాపాత్రో, కమిటీ చైర్మన్‌ ఎలిశెట్టి సురేష్‌కుమార్‌, నాయకులు అల్లు యుగంధర్‌, కొప్పర గాంధీ, టి.రాధాకృష్ణ, సన్యాసిరావు, శేషగిరిరావు, పంచాది అప్పారావు, నర్సింగరావు, సముద్రాల నాగరాజు, లక్ష్మణరావు, రాము, రమణ, శంకరరావు, జాప్‌ నాయకులు అవనాపు సత్యనారాయణ, రవి, ఫెడరేషన్‌ నాయకులు బురాడ శ్రీనివాసరావు, ఎంఎంఎల్‌ నాయుడు, మహిళా జర్నలిస్ట్‌ విజయలక్ష్మి, సీపీఐ నేతలు ఒమ్మి రమణ, బుగత అశోక్‌, రంగరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నాగభూషణం, సుమన్‌, గణేష్‌, చరణ్‌, ఏఐవైఎఫ్‌ నాయకుడు బూర వాసు, కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌, అంబేడ్క రైట్స్‌ అధ్యక్షుడు పీవీ రమణతో పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాలాంధ్ర విలేకరి గోవింద్‌పై

దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

ప్రభుత్వం తీరును నిరసిస్తూ

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద

జర్నలిస్టులు, ప్రజా సంఘాల

నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement