మృత్యుమలుపు | - | Sakshi
Sakshi News home page

మృత్యుమలుపు

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

మృత్యుమలుపు

కన్నీటిపర్యంతమైన ఎస్పీ

విజయనగరం టౌన్‌:

ప్రమాదకరమైన మలుపు.. మృత్యువై ఒకరిని మింగేసింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డా రు. దీంతో పోలీసు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకొంది. ఓ కేసు విచారణ నిమిత్తం విజయనగరం రూరల్‌ పోలీసులు ఆదివారం కొండకరకం గ్రామానికి వెళ్లారు. తిరిగి జేఎన్‌టీయూ మీదుగా వచ్చే క్రమంలో మెడికల్‌ కాలేజీ సమీపంలో ప్రమా దకరమైన మలుపు వద్ద బొలెరో వాహ నం బ్రేక్‌ ఫెయిలై అదుపు తప్పి సుమా రు 20 అడుగులకు పైగా ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అటుగా వెళ్లిన కొందరు ఫోన్‌ ద్వారా అందించిన సమాచారంతో విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్‌ యంత్రాంగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగా త్రులను స్థానిక తిరుమల మెడికవర్‌ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సంప్రదించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సీర వెంకటరమణ కు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ కానిస్టే బుల్‌ సీర వెంకటరమణ (49) మృతి చెందాడు. విజయనగరం రూరల్‌ ఎస్‌ఐ వి.అశోక్‌కుమార్‌కు ఎడమకాలు విరిగి, రిబ్స్‌, పెదవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. హెడ్‌ కానిస్టేబుల్‌ జి.నాగేంద్ర ప్రసాద్‌కు ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరిగిపోయింది. రిబ్స్‌కి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం విశాఖ అపోలో ఆస్పత్రికి తరలించా రు. బొలెరో వాహన డ్రైవర్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె. రాజుకు నడుము భాగంలో ఎముక తప్పిపోవడంతో అత్యవసర శస్త్ర చికిత్స చేశారు.

బాధితులను ఓదార్చిన మంత్రి

ప్రమాద సంఘటన తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామని, గాయపడిన పోలీస్‌ కుటుంబాలకు, మృతి చెందిన కానిస్టేబుల్‌ వెంకటరమణ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

సంఘటనా స్ధలాన్ని సందర్శించిన ఎస్పీ

ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ ఆదివారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులను చూసి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన మలుపు వద్ద సుమారు 20 అడుగుల లోతైన గోతిలో వాహనం పడిపోయినట్లు ఎస్పీ గుర్తించారు.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జెడ్పీ చైర్మన్‌

స్థానిక గాజులరేగ మెడికల్‌ కళాశాల సమీపంలో ఆదివారం రూరల్‌ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన సంఘటనపై జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌తో పాటూ పలువురు సిబ్బంది గాయపడడం, కానిస్టేబుల్‌ రమణ మృతి చెందడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. దుర్ఘటనలో కానిస్టేబుల్‌ మృతి అత్యంత విషాదకరమన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ ఎస్‌ఐ అశోక్‌, సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రమాదం జరిగిన తీరుపై ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ మీడియాతో మాట్లాడుతూనే కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆయన్ను ఓదార్చారు. తమతో పాటూ విధులు నిర్వహిస్తూ, తమ పోలీసు కుటుంబంలోని ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని భావోద్వేగానికి గురయ్యారు. మృతి చెందిన వెంకటరమణ భార్య కుమారి, అతని తల్లిదండ్రులను ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోస్ట్‌మార్టం త్వరగా జరిపించే విధంగా చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎస్‌.రాఘవులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement