నియంత్రణలో విఫలం ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిన బియ్యం, బెల్లం, పంచదార, నూనెలు సామాన్యుడి జీవనంపై తీవ్ర ప్రభావం
తగ్గే అవకాశం ఉంది
ధరలు భరించలేకపోతున్నాం..
విజయనగరం ఫోర్ట్: మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుత పాలకులు గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఏదైనా చార్జీలు స్వల్పంగా పెరిగినా.. బాదుడే బాదుడు.. అంటూ నానా యాగీ చేసేవారు. ప్రస్తుతం వారే అధికారంలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సామాన్యు డి ధరా భారం కనీసం పట్టడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందనంత ౖపైపెకి ధరలు ఎగిసిపడుతున్నాయి. ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు... నాగులో నాగన్న..’ అని ఓ సినీ కవి రచించిన పాట మాదిరి తయారైంది ప్రస్తు త ధరల పరిస్థితి. సామాన్య, మధ్య తరగతి ప్రజ లు ఏం కొనాలన్నా తీవ్ర ఆందోళనకు గురవుతున్నా రు. అంతగా ఉల్లిపాయల నుంచి బియ్యం, బెల్లం, పంచదార, నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ధరల నియంత్రణలో విఫలం
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వాటి ని రాయితీపై తక్కువ ధరకు ప్రజలకు ప్రభుత్వం అందించాలి. దీని వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏవైనా ధరలు పెరిగితే రాయితీపై ప్రజలకు అందించేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరుగుతున్నా.. పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నా రు. ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ధరలు పెరుగుతూ పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర ధరలు పెరగడం గమనార్హం. బెల్లం ధర కేజీ రూ.55కు మించింది లేదు. ప్రస్తుతం బెల్లం కేజీ ధర రూ.70 అయింది. పంచదార రూ.48కు మించింది లేదు. ఇప్పుడు రూ. 75 అయింది. బియ్యం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో సాంబమసూరి ఽకేజీ రూ.45 నుంచి రూ.50 ఉండేది. ఇప్పుడు రూ.60 నుంచి రూ.62 ఉంది. ఉల్లిపాయలు కేజీ రూ.20 ఉండేది. ప్రస్తుతం రూ. 55 అయింది. నూనె ధరలు కూడా పెరిగాయి. పామాయిల్ లీటర్ ధర రూ.115 ఉండేది. ఇప్పుడు రూ.135 అయింది. రిఫైండ్ ఆయిల్ ధర రూ.160 నుంచి రూ.190 అయింది. ఇలా మార్కెట్‌లో దేనికదే ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే తమ జీవనం మాటేంటని పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి ఇంతగా ధరాభారం గతంలో ఎన్నడూ చూడలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బియ్యం ధరలు పెరగడంతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ద్వారా బియ్యం అందిస్తున్నాం. పంచదార, బెల్లం, ఉల్లిపాయలు ఉత్పత్తి తక్కువ కావడంతో ధరలు పెరిగాయి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ధరలు తగ్గే అవకాశం ఉంది.
– బి.రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్ శాఖ
పంచదార, బెల్లం, బియ్యం, ఉల్లిపాయులు, నూనె ధర లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఏది ముట్టుకున్నా షాక్ కొట్టే విధంగా ధరలు ఉన్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువు లు అన్నీ ప్రతీ రోజు వినియోగించేవే. దీంతో ధరాభారం భరించలేకపోతున్నాం.
– పి.గోవింద, పెదవేమలి గ్రామం,
గంట్యాడ మండలం


