విజయనగరం అమ్మాయినే.. ఆశీర్వదించండి | - | Sakshi
Sakshi News home page

విజయనగరం అమ్మాయినే.. ఆశీర్వదించండి

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

హీరోయిన్‌ శ్వేతాలక్ష్మణ్‌

విజయనగరం టౌన్‌: విద్యలనగరమైన విజయనగరంలో పుట్టి, పెరిగి చిత్రసీమలో తనదైన శైలిలో రాణిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ లక్ష్మణ్‌ కుమార్తె శ్వేతాలక్ష్మణ్‌ హీరోయిన్‌గా నటించిన ‘ సహ ’ చిత్రం మెగా ఈవెంట్‌ గురజాడ కళాభారతిలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహ (లైఫ్‌ ఆఫ్‌ సంజు) చిత్రంతో ప్రజల ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదలవుతుందన్నారు. పెద్ది మూవీలో హీరోయిన్‌ జాన్వీకపూర్‌ ఫ్రెండ్‌గా నటించానని తెలిపారు. దర్శకుడు నిషాంత్‌, నిర్మాత తేజ, హీరో శివకుమార్‌, గాయని శ్రీవల్లి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement