చిత్రంలో పిల్లలు, భార్యతో కలిసి ఉన్నది కర్రివలస గ్రామా నికి చెందిన సామురోతు అప్పారావు. ఆధార్ నంబర్‌కు సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి లింక్ అయినట్టు రికార్డుల్లో చూపడంతో ఆయన కుటుంబానికి ప్రభు త్వ పథకాలు నిలిచిపోయాయి. అప్పారావు ఇద్దరు పిల్లల్లో ఒకరు ఏడవ తరగతి, మరొకరు తొమ్మిదవ తరగతి చదు వుతున్నారు. గతంలో అమ్మఒడి పథకం అందినా... ఇప్పు డు తల్లికి వందనం సాయం అందడంలేదు. గతంలో కుడి భుజానికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయించుకుని ప్లేట్ వేయించుకున్నానని, ఇప్పుడు ప్లేట్ తొలగించుకునేందుకు ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదంటూ అప్పారావు వాపోయారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, ఆధార్‌లోని తప్పు వివరాలను సరిచేసి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. – పాచిపెంట


