కొందరికే వందనాలు! | - | Sakshi
Sakshi News home page

కొందరికే వందనాలు!

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

అంకెల్లోనే తల్లులు... కొందరికే వందనాలు!

తల్లికి వందనం పథకంలో తగ్గిపోతున్న లబ్ధిదారులు

వేలాది మంది అర్హులకు మొండిచేయి

వివిధ కారణాలతో అందని పథకం

తప్పులు సరిచేసే వ్యవస్థ లేకపోవడంతో ఆందోళన

సచివాలయాల్లో సరిచేసుకోవచ్చు...

అంకెల్లోనే తల్లులు...

సాక్షి, పార్వతీపురం మన్యం:

ర్హులందరికీ తల్లికి వందనం పథకం అందిస్తున్నామని.. ఎంత మంది పిల్లలుంటే అందరికీ జమ చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. గత ప్రభుత్వం.. ఇంటికి ఒకరికే లబ్ధి అందించేదని.. తాము ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ అందిస్తున్నామని బీరాలు పలుకుతోంది. ఈ లెక్కలన్నీ అంకెల్లోనూ.. ప్రజా ప్రతినిధుల గొప్ప ల్లోనూ కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు అంటున్నా రు. ఈ ప్రభుత్వం వచ్చాక.. జిల్లాలో వేలాది మంది పథకానికి దూరమైన పరిస్థితి ఉంది. వేరొకరి కరెంటు బిల్లులు ఆధార్‌తో లింకు కావడం, భూమి లేకు న్నా ఉన్నట్లు చూపడం.. ఇలాంటి సమస్యలే కాక, తల్లుల పేర్లు కూడా మారిపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాది పూర్తిగా పథకం అమలు చేయలేదు. రెండో సంవత్సరంలో భారీగా కోత పెట్టారు. సీతానగరం, పార్వతీపురం, పాలకొండ, కొమరాడ, కురుపాం.. ఇలా అనేక మండలాల్లో తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ పేరు గత ఏడాది నమోదైంది. లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

‘అందరికీ..’ అంటూ కోత పెట్టేశారు!

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం కింద 2021–22 లో 86,409 మందికి 129.13 కోట్లు, 2022–23లో 83,733 మందికి 129.61 కోట్లు జమ చేశారు. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ పథకం తొలి విడతలో జిల్లాలోని 1,757 కళాశాలలు, పాఠశాలల్లో 1,34,896 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించారు. వారికి సంబంధించిన 82,820 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం సమయంతో పోల్చుకుంటే భారీగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు. అర్హత ఉండి కూడా, తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అందరికీ రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రగల్భాలు పలికి.. రూ.13 వేలు మాత్రమే జమ చేస్తున్నారు. గత ఏడాది రూ.7 వేలు, రూ.8 వేలు చొప్పున కూడా చాలా మందికి జమ అయ్యాయి.

తన పేరు మీదగా గ్రామ సచివాలయంలో తీసిన 80 ఎకరాలకు సంబంధించి వన్‌–బీ పట్టాలు

మండలాల వారీగా అర్హులైన తల్లుల జాబితాలను ఇప్పటికే స్థానిక స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాం. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు రాని విద్యార్థుల తల్లిదండ్రులు తగు డాక్యుమెంట్లతో ఆగస్టు మూడో తేదీ లోపు సంబంధిత సచివాలయంలో సంప్రదించి వివరాలు సరిచూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే వారికి ఆగస్టు 30న విడుదలయ్యే రెండో విడతలో ఆర్థిక సహాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ ఆర్థిక సహాయాన్ని పిల్లల ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు మాత్రమే ఉపయోగించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి.

– ఎన్‌.ప్రభాకర రెడ్డి, కలెక్టర్‌/ సువర్ణ, జిల్లా ఎస్‌జీఎస్‌డబ్ల్యూ ప్రత్యేక అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement