నా పేరు జుంతాడ స్వాతి. మాది పాలకొండ పట్టణంలోని గెద్దవీధి. మా పాప మనశ్విని ప్రస్తుతం స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ ఏడాది కూడా తల్లికి వందనం పథకం లబ్ధి కలగలేదు. గతేడాది మా ఇంటికి రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ, అధిక విద్యుత్ వినియోగం పేరిట లబ్ధి నిలిపేశారు. అప్పట్లో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. తాజాగా అన్ని ధ్రువపత్రాలు సమర్పించాం. విద్యుత్ శాఖ ద్వారా కూడా ధృవీకరించుకున్నాం. అయినప్పటికీ మళ్లీ అధిక విద్యుత్ బిల్లుల పేరిటే లబ్ధి నిలిపేశారు. మళ్లీ విద్యుత్‌శాఖను సంప్రదించగా కేవలం 75 యూనిట్లు వాడినట్లు బిల్లులు అందించారు. వాటిని సచివాలయంలో అందజేశాం. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న తమకు పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – పాలకొండ రూరల్


