సాలూరు: మండలంలో మావుడి రైతుసేవాకేంద్రం పరిధిలోని కొట్టుపరువు గ్రామంలో సత్తి శ్రీనివాసరెడ్డి తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 312 బస్తాల పొటాష్‌ను అధికారులు బుధవారం సీజ్‌చేశారు. ముందస్తు సమాచారం మేరకు వీఏఏలు తిరుపతిరావు, షణ్ముఖరావులతో కలిసి ఏఓ శిరీష శ్రీనివాసరెడ్డి తోటలో ఉన్నగోదాంను తనిఖీ చేసి 312 బస్తాల పొటాష్‌ను గుర్తించారు. వెంటనే ఏడీఏ సత్యవతికి సమాచారం అందించగా ఆమె వచ్చి పరిశీలించారు.అక్రమంగా నిల్వ ఉంచిన ఈ బస్తాలకు సంబంధించి మక్కువ డీలర్ నుంచి కొనుగోలు చేశామని గోదాం గుమస్తా తెలిపిన క్రమంలో బిల్లులను చూపించకపోవడంతో వాటిని సీజ్‌చేస్తున్నట్లు ఆమె తెలిపారు.రూరల్ ఎస్సై రవీంద్రరాజు, వీఆర్‌ఓ సునీల్‌లు వచ్చిన తరువాత గోదాంను సీజ్‌చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. ఇవి నకిలీ ఎరువులా? నాణ్యమైన ఎరువులా? అన్న నిర్ధారణ కోసం ల్యాబ్‌కు శాంపిల్స్ తరలిస్తున్నట్లు ఏడీఏ తెలిపారు.


