● ఆత్మీయ కలయిక
బాడంగి మండల కేంద్రంలోని పీఎంశ్రీ హైస్కూల్‌లో చదివిన 1997–98 పదోతరగతి విద్యార్థుల ఆత్మీయకలయిక శనివారం అపురూపంగా సాగింది. చిన్ననాటి స్నేహితులను చూసి మురిసిపోయారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. చదువుకున్న పాఠశాలలో కలియతిరుగుతూ రోజంతా సందడిగా గడిపారు. తమకు విద్యనేర్పి భవితనిచ్చిన గురువులను సత్కరించారు. హైస్కూల్‌కు అనుబంధంగా నడుపుతున్న బాలికల హాస్టల్‌కు రూ.42వేల విలువైన ఇన్వెర్టెర్‌ను అందజేస్తామని హెచ్‌ఎం సత్యనారాయణకు తెలియజేశారు. విద్యార్థులందరినీ ఒక చోటకు చేర్చేందుకు బ్యాచ్‌మేట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరు లక్ష్మాజీరావు కృషిని తోటి విద్యార్థులు కొనియాడారు.
– బాడంగి


