జాతీయ కబడ్డీ పోటీలకు రిఫరీలుగా జిల్లా పీఈటీలు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న అండర్–14 స్కూల్ గేమ్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల నిర్వహణకు రిఫరీలుగా జిల్లాకు చెందిన నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు నియామకమయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు గుడివాడలో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను పర్యవేక్షించటంలో జిల్లాలోని నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పి.అన్నపూర్ణ, శ్రీరామ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మొయిద ఉదయ్, తెర్లాంలో విధులు నిర్వహిస్తున్న పి.రమ, ఎస్.కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వై.పావనీ నియామకమైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యాల నాయుడు తెలిపారు.
క్రీడాకారులకు అభినందనలు
నెల్లిమర్ల రూరల్: భోపాల్‌లోని సేజ్ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన సౌత్‌వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ వర్సిటీ బీబీఏ విద్యార్థులు(క్రీడాకారులు) బి.ఆదినారాయణ, వి.సుశ్మితలతో పాటు 69వ జాతీయ పాఠశాలల క్రీడాపోటీల విజేత వి.రమాదేవిలను వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు శనివారం అభినందించారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్‌కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పి.పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆసిఫ్, కోచ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ కబడ్డీ పోటీలకు రిఫరీలుగా ఎంపికై న జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు
జాతీయ కబడ్డీ పోటీలకు రిఫరీలుగా జిల్లా పీఈటీలు


