జీలుగుకల్లు తాగిన పలువురికి అస్వస్థత
● డోలీలో ఆస్పత్రికి తరలింపు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని వనకాబడి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు శనివారం జీలుగుకల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. జీలకర్ర భూషణరావు, నీలకంఠం, జోగారావు, మాసింగికి వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో నీరసించిపోయారు. వారిని కుటుంబ సభ్యులు డోలీలో మూడు కిలోమీటర్ల రాళ్లదారిలో తరలించి అనంతరం ఆటోలో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. గ్రామంలో మరికొంతమంది కల్లుతాగి అనారోగ్యం బారిన పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. వైద్య శిబిరం నిర్వహించే సేవలందించాలని వైద్యులను కోరారు.
జీలుగుకల్లు తాగిన పలువురికి అస్వస్థత


