ముగిసిన క్రికెట్ టోర్నీ
నెల్లిమర్ల రూరల్: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని, మండలంలోని అలుగోలు గ్రామంలో ఏపీఎల్(అలుగోలు ప్రీమియర్ లీగ్) పేరిట నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శనివారంతో ముగిసింది. ఈ పోటీల్లో మొత్తం 10 జట్లు పాల్గొనగా అలుగోలు వారియర్స్, అలుగోలు సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో అలుగోలు సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీ కై వసం చేసుకుంది. విజేత జట్టుకు వైస్ ఎంపీపీ సారిక వైకుంఠం, గ్రామపెద్దల చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.


