వెంకన్నను దర్శించుకున్న ప్రముఖులు
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లను సంక్రాంతి సందర్భంగా పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకొని పూజలు చేశారు. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గేదెల తుహీన్‌కుమార్ దంపతులు, పార్వతీపురం జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తదితరులు దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు, కార్యనిర్వాహణాధికారి బి.శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు పూర్ణకలశంతో స్వాగతం పలికి స్వామివారిని దర్శింపజేసిన అనంతరం వేద ఆశీర్వచనాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ విశిష్టతను, అభివృద్ధిని వివరించారు.
గుర్ల: మండలంలోని దమరసింగి, వల్లాపురంలో స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతులు, యువత శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు వల్ల జరిగే నష్టాన్ని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
విజయనగరం ఫోర్ట్: సంక్రాంతి పండగకు జిల్లా ప్రజలు భారీగానే ఖర్చు చేశారు. పండగకు కొత్త దుస్తులకు, మద్యం, మాంసం, కిరాణ సామగ్రికి, ఇళ్ల పెయింటింగ్‌కు ఇలా అధిక మొత్తంలోనే ఖర్చు చేశారు. సంక్రాంతి పండగకు నెల రోజులు ముందు నుంచి ప్రజలు ఇళ్లకు సున్నాలు, పెయింటింగ్ వేయించడం దగ్గర నుంచి భోగి, సంక్రాంతి, కనుమ పండగ వరకు ఖర్చు చేస్తూనే ఉన్నారు. పండగ 20 రోజుల ముందు నుంచే కొత్త దుస్తులు కొనుగోలు చేయడంలో ప్రజలు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పల్లెల్లో సంక్రాంతి పండగను సంబరంగా జరుపుకున్నారు.
ఇంటిల్ల్లిపాది..
సంక్రాంతి పండగను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. కొంతమంది సంక్రాంతి రోజున పండగ జరుపుకోగా మరికొంత మంది కనుమ రోజు పండగ జరుపుకుంటారు. రైతులు పండించిన పంట కూడా ఽసంక్రాంతి పండగ నాటికి ఇంటికి వస్తుంది. దీంతో కుమార్తెలను, అల్లుళ్లను సంక్రాంతి పండగకు పిలిచి వారికి కొత్త దుస్తులు పెట్టి, వారికి ఇష్టమైన పిండి వంటలు వండి పెడతారు.
మద్యం విక్రయాలు అధికమే..
జిల్లాలో 170 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి కాకుండా బెల్టు దుకాణాలు వేలల్లో ఉన్నాయి. గ్రామాల్లో సంధుకొకటి చొప్పున ఉన్నాయి. దీంతో మద్యం ప్రియులు ఫుల్‌గా తాగేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు మద్యం వ్యాపారాలు జరిగాయి.
కిరాణా సామగ్రి, మాంసం, చేపలు విక్రయాలు అధికమే
సంక్రాంతి పండగకు పిండి వంటలు, ఇతర వంటకాలు వండడానికి జనం కిరాణా సామగ్రి అధికంగానే కొనుగోలు చేశారు. మాంసం, చేపలు విక్రయాలు కూడా అధికంగానే జరిగాయి.


