శాంతిభద్రతల రక్షణకు పటిష్ట చర్యలు
రేగిడి: స్థానిక పోలీసుస్టేషన్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం సందర్శించారు. మండలంలో క్రైమ్ రేటు తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సంబంధించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలి
రాజాం సిటీ: పోలీసులు ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. రాజాం టౌన్, రూరల్ సర్కిల్ కార్యాలయ సిబ్బందితో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ సందర్భంగా ప్రయాణాలు చేస్తున్న ప్రజలకు ‘రిటర్న్ జర్నీ–సేఫ్ జర్నీ’ పేరిట గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు హెల్మెట్ వాడకంపై విస్తృతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల సమస్యలను సామరస్యంగా అడిగి తెలుసుకోవాలన్నారు. గంజాయి వినియోగించే స్థావరాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయనతో పాటు రాజాం టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్ర, సిబ్బంది ఉన్నారు.
సిబ్బందిని అభినందిస్తున్న ఎస్పీ దామోదర్


