ఆమె చేతిలో ముగ్గుల తంత్రం
వీరఘట్టం: ఆమె చేతిపై వేసిన అనకొండ కొండ చిలువ పెయింటింగ్ అచ్చం నిజంలా అనిపించేలా ఉంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పెయింటింగ్ మాత్రమే కాకుండా అందమైన రంగవల్లులు వేస్తూ అందరినీ మంత్ర ముగ్గులను చేస్తున్నారు ఆమె. పండగ ఏదైనా సరే తనదైన శైలిలో ముగ్గులు వేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నారు వీరఘట్టంకు చెందిన గృహిణి భోగి పద్మిని. తన ఇంటి వాకిటిలో ప్రతీ రోజూ అందమైన ముగ్గులు వేస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు. పద్మిని వద్ద ముగ్గులు వేయడం నేర్చుకునేందుకు పలువురు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
ఆమె చేతిలో ముగ్గుల తంత్రం
ఆమె చేతిలో ముగ్గుల తంత్రం


