గోదారోళ్లను మరిపించేలా..
రామభద్రపురం: గోదాదారోళ్లను మరిపించేలా.. ఉత్తరాంధ్రలో కూడా కొత్త అల్లుళ్లకు అతిథి మర్యాదల్లో కొత్తదనం చూపుతున్నారు. మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన బొడ్డు నాగసైన్, సత్య దంపతుల కుమార్తె పద్మావతిని అదే కాలనీకి చెందిన పూసర్ల వెంకటసాయికుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయితే సంక్రాంతి పండగకు పిలిచి సుమారు 101 రకాల వంటకాలతో భోజనం పెట్టి కొత్త అల్లుడిపై ప్రేమను చూపించారు. పిండి వంటలతో తయారు చేసిన మిఠాయిలు, గారెలు, పకోడి, బూరెలు, పండ్లు, కూల్ డ్రింక్స్ వంటి వివిధ రకాలతో భోజనం పెట్టి అతిథి మర్యాదలు చూపారు. గోదావరి జిల్లాల్లో ఈ వంటకాలతో కొత్త అల్లుళ్లకు మర్యాదలు చేస్తారు. అదే విధంగా ఉత్తరాంధ్ర అయిన ఇక్కడ కూడా 101 రకాల వంటకాలతో భోజనం పెట్టి కొత్త అల్లుడుకు మర్యాద చేయడంతో చర్చించుకుంటున్నారు.


