శ్రీనివాసరావు సేవలు స్ఫూర్తిదాయకం
రాజాం సిటీ: మున్సిపాలిటీ పరిధి సారథి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కిల్లారి శ్రీనివాసరావు సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కొనియాడారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 21 ఏళ్లుగా పేదలకు కొత్త వస్త్రాలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. శ్రీనివాసరావు సమకూర్చిన దుస్తులను పేదలకు గురువారం గ్రామంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సేవా గుణం అలవర్చుకోవాలన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సహృద్భావ వాతావరణం నెలకొంటుందని తెలిపారు. సుమారు 5వేల మందికి దుస్తులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, పాలవలస మణికంఠ, దూబ గోపాలం, మజ్జి మధన్‌మోహన్, వారాడ వంశీకృష్ణ, మజ్జి పెంటన్నాయుడు, ఎస్సై వై.రవికిరణ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్


