మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ విగ్రహం ధ్వంసం
లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖపట్నం జాతీయ రహదారి సీతారాంపురం గ్రామం జంక్షన్‌లో గల మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తెల్లవారు జూమున చూసేసరికి విగ్రహం చేతులు,ముఖం పూర్తిగా విరగొట్టి ఉండడం స్థానికులు గమనించారు.దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు లక్కవరపుకోట, వేపాడ ఎస్సైలు నవీన్‌పడాల్, సుదర్శన్‌లతో కలిసి పరిశీలించారు.విగ్రహం ధ్వంసం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెల్కోన్నాయి. ఎటువంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా ముందస్తుగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు క్లూస్‌టీమ్‌తో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఈ ఘటనపై ఎస్సై నవీన్ పడాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● తక్షణమే స్పందించిన కలెక్టర్
కొమరాడ: మండలంలోని శివిని పంచాయతీ సూర్యంపీఠం సమీపంలో రాయగడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న లారీ పార్వతీపురం నుంచి వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు గురువారం గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి వెంటనే క్షత్రగ్రాతులను జిల్లా అస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బంతు కిరణ్‌కుమార్, బండి రత్నాలుకు త్రీవ గాయాలు కావడంతో వారిని మెరుగైన చిక్సిత కోసం వైజాగ్‌లోని కేజీహెచ్‌కు తరలించినట్లు తెలిపారు.


