తొక్కుడువలసకు బోరొచ్చింది
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలస గ్రామానికి ఎట్టకేలకు మంచినీటి సమస్య తీరనుంది. గ్రామానికి బోరు తవ్వే పనులను అధికారులు చేపట్టారు. గ్రామస్తుల తాగునీటి సమస్యను ‘తేనె కాదు.. తాగునీరే’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. గిరిజనులు కూడా తమ ఆవేదనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో బోరు తవ్వేందుకు నిధుల సమస్య ఉన్నట్లు సంబంధిత అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంపీపీ, సర్పంచ్‌లు తమ నిధుల నుంచి కొంత మొత్తం సమకూర్చగా.. సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో గ్రామంలో బోరు తవ్వించారు. తాగునీటి కష్టాలు తీరే దారి దొరికిందని గిరిజనులు సంతోషపడుతున్నారు.
తొక్కుడువలసకు బోరొచ్చింది
తొక్కుడువలసకు బోరొచ్చింది


