ఆపద సమయంలో ఆదుకునే 108 వాహనానికే కష్టం వచ్చింది. సీతానగరం మండలానికి గతంలో మంజూరైన 108 వాహనం మరమ్మతులకు గురి కావడంతో కొద్దిరోజుల కిందట మరో వాహనాన్ని తీసుకొచ్చారు. అది కూడా తరచూ మొరాయిస్తుండడంతో మరొక వాహనాన్ని ఇచ్చారు. పోనీ.. ఇప్పుడున్న వాహనమైనా సక్రమంగా ఉందా.. అంటే అదీ లేదు. ఇంజిన్ సమస్య ఉంది. ఇంజిన్ ఆపితే మళ్లీ కదలడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. దీంతో నిరంతరం వాహన సిబ్బంది ఇంజిన్‌ను ఆన్‌చేసే ఉంచుతున్నారు. దీనివల్ల లోపల వేడిగా అవుతుందని.. పనిలేని సమయంలో వాహనం డోర్లన్నీ.. ఇదిగో ఇలా తీసి ఉంచుతున్నారు. ఈ చిత్రాన్ని చూసి.. ఆపద్బాంధవికే కష్టం వస్తే చెప్పుకునే దిక్కులేకపోయిందంటూ స్థానికులు నిట్టూర్చుతున్నారు. – సీతానగరం


