పార్వతీపురం రూరల్:
ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు, రద్దీగల ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్న నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రూ.17 ద్విచక్ర వాహనాలను స్వాధీ నం చేసుకున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి గురువారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంతకాలంగా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన నిమ్మల శివాజీ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిస కావడంతో ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితుడ్ని పట్టుకునేందుకు పట్టణ, జిల్లా సీసీఎస్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ద్విచక్రవాహనాల దొంగతనం జరిగిన ప్రదేశాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీ లించగా నిందితుడు రైల్వేస్టేషన్ వైపు నడిచివెళ్లి తిరుగు ప్రయాణంలో మోటార్ సైకిల్‌పై రావడాన్ని గమనించి గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని గుర్తించి ముందస్తు సమాచారంతో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సంచరిస్తున్న నింది తుడ్ని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
చోరీకి పాల్పడే విధానం
ద్విచక్రవాహనాల పాత తాళాలను కొన్నింటిని సేకరించి పార్వతీపురం, విజయనగరం లాంటి ప్రాంతాలకు బస్సులో వెళ్లి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కు వ సమయం పార్కింగ్‌లో ఉండే ద్విచక్రవాహనాల ను గమనించి తన వద్ద ఉన్న ఆ తాళాలతో ప్రయత్నించి ఏదైనా ద్విచక్ర వాహనానికి తాళం సరిపోతే ఆ ద్విచక్రవాహనాన్ని స్టార్ చేసి అక్కడి నుంచి పరా రవుతాడు. దొంగతనంగా తీసుకువెళ్లిన ద్విచక్రవాహనాలను తన చెడు వ్యసనాల నిమిత్తం రూ.3వేల నుంచి రూ.5వేలకు విక్రయిస్తాడు.
13 వాహనాల వివరాలు గురింపు
స్వాధీనం చేసుకున్న 17 వాహనాల్లో 13 వాహనాల ను పోలీసులు గుర్తించగా వాటిలో పార్వతీపురం పట్టణ పరిధిలోనివి 7, సీతానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 1, విజయనగరం జిల్లా పరిధిలో 4, విశాఖపట్నం హార్బర్ పీఎస్ పరిధిలో 1 ఉన్నాయి. మిగిలిన మరో నాలుగు వాహనాలకు సంబంధించిన వివరాల కోసం దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వాహనాలను త్వరలో యజ మానులకు అందించనున్నట్లు చెప్పారు.
17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి
బైక్‌ల దొంగ అరెస్ట్
బైక్‌ల దొంగ అరెస్ట్


