ఈయన పేరు తప్పెట సాంబయ్య. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామం. సర్వే నంబరు 313/5లో ఉన్న ఆయనకు సంబంధించిన ఎకరా 30 సెంట్ల భూమి సత్యవరపు వాసుదేవరావు అనే వ్యక్తి పేరిట తప్పుగా ఆన్‌లైన్ అయ్యింది. దానిని సరిచేసి, తనకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వినతిపత్రం అందజేశాడు. నిర్ధిష్ట సమయంలోగా వినతిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.. నేటికి మూడు నెలలుగా తిరుగుతున్నా.. ఇప్పటికీ మోక్షం కలగలేదు. వృద్ధాప్యంలోనూ కాళ్లరిగేలా తిరుగుతున్నానని.. ఏ ఒక్కరూ కనికరించడం లేదని సాంబయ్య వాపోతున్నాడు.