
సీతంపేటలో సిబ్బందికి సూచనలిస్తున్న డీఐజీ హరికృష్ణ, పక్కన ఎస్పీ విక్రాంత్ పాటిల్
పాలకొండ/సీతంపేట: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పోలీస్ వ్యవస్థ సంతృప్తికరంగా సేవలందజేస్తోందని డీఐజీ ఎస్.హరికృష్ణ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పాలకొండ, సీతంపేట పోలీస్‌స్టేషన్లను ఆయన శనివారం సందర్శించారు. స్టేషన్ పరిధిలోని రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ ప్రాంతంలో మావోల ప్రభావం లేదన్నారు. కూంబింగ్ మాత్రం యథావిధిగా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. పలు పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది ఖాళీలపై స్పందిస్తూ ఇప్పటికే ఎస్సై పోస్టులకు పరీక్షలు జరిగాయని, త్వరలోనే కానిస్టేబుల్ ఎంపికలు జరుగుతాయని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాల మెరుగుకు కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. గ్రామాలను వారికి దత్తత ఇచ్చామన్నారు. ఎస్‌ఐలు కూడా మానిటరింగ్ చేస్తున్నారన్నారు. పోలీసులు స్థానికంగా నివసించేందుకు వీలుగా క్వార్టర్స్ లేని చోట నిర్మాణానికి కొత్తగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఆయన వెంట పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ జి.వి.కృష్ణారావు ఉన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
సంతృప్తికరంగా పోలీస్ సేవలు
పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకానికి చర్యలు
డీఐజీ హరికృష్ణ