డీఎస్సీ నిరసన అనంతరం 300 మంది మీద కేసులు పెట్టామని చెబుతున్న నేపథ్యంలో వారి జాబితా ఇస్తే మేమంతా స్వయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి హాజరవుతాం. ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను భయపెట్టవద్దని కోరుతున్నాం. ఆయుధాలు లేని, గాయాలు లేని ఘటనలో 307 కేసు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నాం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంపై సమాధానం చెప్పాలి. అసలు మామూళ్లు వసూలు చేస్తూ రౌడీయిజం చేస్తున్న మంత్రి నారా లోకేష్‌పై రౌడీషీట్ తెరవాలి.
– అంబటి రాంబాబు,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


