మా స్వస్థలం వినుకొండ మండలం ఏనుగుపాలెం. అమ్మానాన్న పుష్పలత, శ్రీనివాసరావు. వినుకొండ మండలంలోని మండల పరిషత్ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పని చేస్తున్నారు. సీనియర్ ఇంటర్‌లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 100 పర్సంటైల్ కై వసం చేసుకున్నాను. మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధం అవుతున్నాను. అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు కై వసం చేసుకుని, ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాను. తదుపరి స్టార్టప్ ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా.
– తుంగా దుర్గా సుప్రభాత్, ఓపెన్ కేటగిరీ 11వ ర్యాంకు


