కలెక్టర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కన్నా... | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కన్నా...

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

కలెక్టర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కన్నా... భూ సేకరణపై గ్రామసభ వైభవంగా ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు విఘ్న విమోచక హనుమాన్‌కు ప్రత్యేక పూజలు

టీడీపీ నేత కోడెల శివరాం

ఇచ్చిన ఫిర్యాదుపై చర్చ

సాక్షి, నరసరావుపేట : పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ నేత కోడెల శివరాం ఏకంగా ఎనిమిది పేజీల లేఖను సోమవారం జిల్లా కలెక్టర్‌కు అందించినట్టు తెలియవచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేలు చేసిన అక్రమ మైనింగ్‌, కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఆధారాలతో కలెక్టర్‌, విజిలెన్స్‌ అధికారులకు సమర్పించినట్టు తెలిసింది. దీంతో దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో అక్రమ మైనింగ్‌ను మంగళవారం నిలిపివేశారు. శివరాం ఇచ్చిన ఫిర్యాదుతో కంగుతిన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనాయణ, షాడో ఎమ్మెల్యేగా పేరొందిన దరువూరి నాగేశ్వరరావులు మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాను కలిసి శివరాం ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించినట్టు సమాచారం.

దాచేపల్లి : ౖరెల్వే ట్రాక్‌ విస్తరణలో భాగంగా భూ సేకరణకు రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. గుంటూరు నుంచి బీబీ నగర్‌ వరకు చేపట్టే డబ్లింగ్‌ పనులకు సంబంధించి దాచేపల్లి మండల పరిధిలో 9.32 ఎకరాల పట్టాభూమి అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కేసానుపల్లి, పెదగార్లపాడు గ్రామాల పరిధిలో అవసరమైన భూమి సేకరణ కోసం గురజాల ఆర్డీవో మురళీకృష్ణ అధ్యక్షతన కేసానుపల్లి గ్రామ సచివాలయంలో రైతులతో గ్రామ సభ నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డులు, సంబంధిత రైతు బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని ఆర్డీవో మురళీకృష్ణ చెప్పారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, వీఆర్వో గిరి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి: జగద్గురువులు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు సత్తెనపల్లిలో వేదగాయత్రీ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. సంఘ బాధ్యులు అత్తలూరు అనిల్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీబొమ్మల సెంటర్‌ విఘ్నేశ్వరుడి ఆలయంలో ముందుగా పూజా కార్య క్రమాలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. వేదగాయత్రీ పురోహిత సంఘం బాధ్యులు డాక్టర్‌ గుండ్లపల్లి శ్రీధర్‌, కొనంకి మారుతీ, అంపిరాయని రాజశేఖర్‌ శర్మ, గుండవరపు అమర్‌నాథ్‌, మణికంఠ, రవి, గోవర్ధన్‌, ధ్రువ కుమార్‌ పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌ : గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రిపై వేంచేసిన యున్న శ్రీ విఘ్న విమోచక హనుమాన్‌కు మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఉన్న 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ విఘ్న విమోచక హనుమాన్‌ విగ్రహానికి గులాబీ పూలతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. సినిమా కొరియెగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ సతీసమేతంగా అర్చన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement