పరీక్ష రోజున కేంద్రం మార్పు | - | Sakshi
Sakshi News home page

పరీక్ష రోజున కేంద్రం మార్పు

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పరీక్ష రోజునే కేంద్రాన్ని మార్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఏఎన్‌యూ పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షల్లో తొలుత రేపల్లె ప్రాంతంలోని నాలుగు కళాశాలలకు బాపట్లలోని ఒక సెంటర్‌ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష జరిగిన ఈ నెల 21వ తేదీన సెంటర్‌ను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలోని సెంటర్‌కు బదులుగా మరో సెంటర్‌ను కేటాయించారు. గతంలో వీటిలో ఒక కళాశాలకు సెల్ఫ్‌ సెంటర్‌ను కేటాయించేవారు. ఇలా మార్చటంలో ఔచిత్యం ఏంటో వర్సిటీ అధికారులకే తెలియాలి. 21వ తేదీన పరీక్ష ఉండగా, అదే రోజున సెంటర్‌ మార్చినట్లు ఉత్తర్వులు ఇవ్వడం వర్సిటీ పనితీరుకు నిదర్శనం. మార్చిన సెంటర్‌లో హాల్‌ టికెట్లను పరీక్షా కేంద్రంలోనే అందజేశారు. నూతనంగా మార్చిన కేంద్రంలో కేటాయించిన కొన్ని కళాశాలల్లో గతంలో పీజీ కోర్సులను తొలగించినట్లు సమాచారం. ఒక కళాశాల కోసమే ఇతర కళాశాలలను కూడా మార్చినట్లు, విద్యార్థులు లేకపోయినా సెంటర్‌ కేటాయించినట్లు సమాచారం. ఏఎన్‌యూ పీజీ నాలుగో సెమిస్టర్‌ పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థుల హాల్‌ టికెట్లలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌ నెలలో పరీక్షలు జరుగుతుండగా, జూన్‌ నెలలో పరీక్షలు అన్నట్లు ‘6’ నెలగా ముద్రించారు. వారాల వివరాలు కూడా తప్పుగా ముద్రించడం గమనార్హం.

ఏఎన్‌యూలో మరో మాయాజాలం

Advertisement
 
Advertisement
Advertisement