మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 నిమ్మకాయల ధరలు
పులిచింతల సమాచారం
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అవసరం యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కొలువై ఉన్న భూసమేత రంగనాయకస్వామి ఆలయం కనుమరుగైన ఒక సామ్రాజ్య వైభవానికి సజీవ సాక్ష్యం. కొండవీడు ప్రాకారాల నీడలో కాలగర్భంలో కలిసిపోయిన ఒక గొప్ప సంస్కృతికి, అచంచలమైన భక్తికి ఈ కోవెల నిలువుటద్దం. ఈ నెల 27 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్న కల్యాణ మహోత్సవాల నేపథ్యంలో తరాల నాటి రాజసానికి, గొప్ప ఆధ్యాత్మికతకు వారధిగా నిలుస్తున్న ఈ పుణ్యక్షేత్ర విశిష్టతపై ప్రత్యేక కథనం..
చరిత్ర పుటలను ఒకసారి వెనక్కి తిప్పితే, క్రీస్తు శకం 1616 ప్రాంతంలో కొండవీడును పాలించిన జూపల్లి రంగపతిరావు అనే రాజు రంగనాథుడికి పరమ భక్తుడు. స్వామిపై ఉన్న అపారమైన భక్తితో శ్రీరంగం నుంచి విగ్రహాలను తెప్పించి, రామేశ్వరపు శిల్పుల చేత అద్భుతంగా తీర్చిదిద్దించి తన ఆరాధ్య దైవం పేరు మీద కొండవీడు ప్రాంతంలో ‘శ్రీరంగనగరం’ అనే ఊరిని నిర్మించాడు. కాలక్రమంలో రాజ్యాల మధ్య దండయాత్రలు, కల్లోలాల వల్ల ఆ గ్రామం విలవిలలాడింది. ఆ దివ్య విగ్రహాలకు ఎలాంటి హాని కలగకూడదన్న ఉద్దేశంతో నాటి భక్తులు స్వామిని సురక్షితంగా భూమిలో నిక్షిప్తం చేశారు. ఆ స్వామి మాత్రం శతాబ్దాలపాటు చీకటి పొరల్లో..నేల తల్లి ఒడిలో మౌనముద్రలో కాలపరీక్షకు ఎదురుచూస్తూ ఉండిపోయారు.
స్వామివారు మళ్లీ వెలుగులోకి రావడానికి ఒక సామాన్యుడిని ఎంచుకున్నారు. రావి కోటయ్య అనే రైతు తన పొలంలో నాగలితో దున్నుతుండగా, భూమిలో నుంచి వింత శబ్దం వినిపించింది. తవ్వి చూడగా శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలుగులీనుతున్న రంగనాయకస్వామి విగ్రహాలు దర్శనమిచ్చాయి. వాటిని నాదెండ్లకు తరలించాలని ఊరి పెద్దలు భావించినా..స్వామి ఇష్టపడకపోవడంతో అదే ప్రదేశంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆ పుణ్యమూర్తి కొలువైన ఆ పవిత్ర ప్రదేశమే నేటి సొలస గ్రామం. 1885లో బాపతు వంశీయులు స్థలాన్ని ఇవ్వగా, అర్వపల్లి కోటయ్యశ్రేష్టి, రామస్వామి శ్రేష్టి సోదరులు ముందుకు వచ్చి ఆ స్థలంలో స్వామికి భక్తిశ్రద్ధలతో రాతి ఆలయాన్ని నిర్మించి, స్వామికి జీర్ణోద్ధారణ గావించి ఈ క్షేత్రానికి పునర్వైభవం తెచ్చారు. నేడు నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై వెలుగుతున్నాడు.
ఈ ఆలయంలో గర్భగుడి ద్వారం వద్ద జయవిజయులు స్వాగతం పలుకుతారు. లోనికి వెళితే శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న రంగనాథుడు, పాదసేవ చేస్తున్న శ్రీదేవి, భూదేవి మూర్తులు భక్తులను పరవశింపజేస్తాయి. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే.. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి బ్రహ్మోత్సవాలకు నాలుగు రోజుల ముందు స్వామివారి అలంకారాలను పూర్తిగా తొలగిస్తారు. ఆ ఒక్కరోజు మాత్రమే భక్తులకు స్వామివారి ‘నిజరూప దర్శనం’ లభిస్తుంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తజనం పోటెత్తుతారు. మరో విశేషం ఏమిటంటే.. ఆంజనేయస్వామి రెండు విభిన్న రూపాల్లో కొలువై ఉండటం, గణపతిదేవుడు భూమాతలా గోళాకారంలో దర్శనమివ్వడం.
ఈ పవిత్ర క్షేత్రం నేడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, ఆలయ సేవల్లో అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు తమ భక్తిని చాటుకుంటున్నారు. నాటి తొలి అర్చకులు పర్చూరి వెంకట రమణాచార్యుల వారసత్వాన్ని ఐదో తరానికి చెందిన రామకృష్ణమాచార్యులు కొనసాగిస్తుండగా, ఆరో తరానికి చెందిన అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు ధర్మకర్తలుగా ఆలయ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. సుమారు 150 ఎకరాల మాన్యం భూములు కలిగి ఉన్న ఈ ఆలయం, ఇప్పుడు కళ్యాణోత్సవాలకు ముస్తాబై భక్తులను ఆహ్వానిస్తోంది. ఆ దివ్య వైభవాన్ని కళ్లారా చూసి తరించడం భక్తుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తారట.
న్యూస్‌రీల్
నేలతల్లి దాచిన నిధి.. సొలస రంగనాథుడి దివ్య సన్నిధి కొండవీడు కోట నీడలో కోవెల 24న స్వామివారి నిజరూప దర్శనం 27వ తేదీ నుంచి మే 5 వరకు కల్యాణోత్సవాలు
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8000, గరిష్ట ధర రూ.13,700, మోడల్ ధర రూ.10,500 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2280 టీఎంసీలు.
రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్
ఏడీ జ్ఞానసుందరం
చీరాల: అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.జ్ఞానసుందరం పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక ఐటీసీ కంపెనీలో అగ్ని ప్రమాదాల నివారణపై జరిగిన వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ మాట్లాడుతూ.. వారం రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలను వర్క్‌షాపులో వివరించారు. గృహాలు, పరిశ్రమలు, పెట్రోలు బంకులు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లలో అగ్ని నిరోధకాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యుత్, గ్యాస్ కారణంగా సంభవించే ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోందన్నారు. తమ సిబ్బంది ఇచ్చే సూచనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా అందుబాటులో ఉన్న అగ్ని నిరోధకాలతో మంటలు అదుపు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక పరికరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ కేఎన్‌రావు, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్, చీరాల సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ, ఐటీసీ జీఎం శ్యామ్‌సుందర్, ఈహెచ్‌ఎస్ సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎన్ రెడ్డి, జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
మట్టిలో మౌనం.. శతాబ్దాల ధ్యానం..
నాగలి స్పర్శతో భక్తులకు దర్శనం
అలంకారం వీడి..ఆత్మరూపం చూపి
తరాల సేవ..తరగని భక్తి...
అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి
ఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
7