వైభవంగా శివపార్వతుల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శివపార్వతుల కల్యాణం

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

మహా కుంభాభిషేకం నిర్వహించిన బాల స్వామిజీ 10 వేల మందికి అన్నదానం

అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రమైన గంగా పార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం సోమవారంతో ముగిసింది. దేవాలయ అర్చకులు చావలి శ్రీధర్‌శర్మ పండిత బృందం హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశాయి. అనంతరం దేవాలయాల శిఖరాలకు విద్యా పీఠం పీఠాధిపతి పజ్ఞానంద సరస్వతి (బాల స్వామిజీ) మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొని తిలకించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేద పండితులు, దాతలు, కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్‌ పావులూరి రమేష్‌, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్‌ శ్రీనివాసవర్మ, మంతెన అనుపమ, పావులూరి సుబ్బారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు (వాసు), నిర్వాహకులు ఉప్పల పద్మజ, అరుణ, తమ్మన సాంబశివరావు, నన్నపనేని పద్మ, పావులూరి వరలక్ష్మి, ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement