ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గణపవరంలో సంచలనం రేపింది. గ్రామంలోని సినిమాహాల్‌ రోడ్డులో యర్రం శ్రీధర్‌రెడ్డి స్పిన్నింగ్‌ మిల్లులో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రికి చెందిన దంపతులు స్పిన్నింగ్‌ మిల్లు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాపూర్‌ ప్రాంతానికి చెందిన ప్రసాద్‌దాస్‌ మాలిక్‌ ఇదే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల కిందట ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన ప్రసాద్‌దాస్‌మాలిక్‌ నాలుగేళ్లు వేరే కంపెనీలో పనిచేసి, మూడేళ్లుగా స్పిన్నింగ్‌మిల్లు క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉంటున్నాడు.

చిన్నారికి మాయమాటలు చెప్పి..

ఆదివారం ఉదయం చిన్నారి తల్లిదండ్రులు ఇరువురూ పనులకు వెళ్లటంతో ఒంటరిగా ఉన్న చిన్నారికి ప్రసాద్‌ దాస్‌ మాలిక్‌ మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. విషయం చుట్టుప్రక్కల కార్మికులకు తెలియటంతో వారు ప్రసాద్‌ దాస్‌ మాలిక్‌ను నిలదీశారు. నిందితుడికి దేహశుద్ధి చేసి ఒంటిపై వాతలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాదెండ్ల ఎస్సై ఆర్‌ వెంకటేశ్వరరావు, రూరల్‌ ఎస్సై రేఖాప్రియాంక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా క్లూస్‌టీం బృందం స్పిన్నింగ్‌ మిల్లు చేరుకుని స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్‌ నిరంజన్‌ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడు ప్రసాద్‌దాస్‌మాలిక్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement