రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పరారీలో ఉన్న నిందితుల అరెస్ట్‌ మాస్‌ మీడియా అధికారిగా శివసాంబిరెడ్డి గుంటూరు మెడికల్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పదోన్నతిపై మాస్‌ మీడియా అధికారిగా బి.శివసాంబిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మిని కలిసి పదోన్నతి ఉత్తర్వుల కాపీ అందించారు. హెల్త్‌ అసిస్టెంట్‌గా 1990లో తూళ్లూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేశారు. పదోన్నతి పొంది 1998లో హెల్త్‌ ఎడ్యుకేటర్‌గా తాడికొండ గ్రామీణ ఆరోగ్యకేంద్రంలో పనిచేశారు. గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో 2018లో పదోన్నతి పొంది డెప్యూటీ మాస్‌ మీడియా అధికారిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో పదోన్నతిపై ఒంగోలులో హెల్త్‌ ఎక్సటెన్షన్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌, మచిలీపట్నం, నల్లపాడు రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లలో పనిచేశారు. పదోన్నతి పొందిన బి.శివసాంబిరెడ్డి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి బాధ్యతలు స్వీకరించారు.

చిలకలూరిపేట టౌన్‌: రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో జరిగింది. సుభానినగర్‌కు చెందిన వెంకట నారాయణ (40) సోమవారం వేకువజామున కాలనీకి సమీపాన ఉన్న ఓగేరు పాత అయ్యప్ప గుడి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వరి పొట్టు లోడు ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ కు తీవ్ర గాయాలు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అర్బన్‌ పోలీసులు ఘటనా స్థలం సందర్శించి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

తెనాలిరూరల్‌: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెనాలి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నాయబ్‌ రసూల్‌ వివరాలు వెల్లడించారు. జనవరి 30న మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో రూరల్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వీరిలో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వల్లాగి విజయ్‌, తెనాలి నాజరుపేటకు చెందిన వడ్లమూడి గోపికిరణ్‌, మండలంలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన దేవరకొండ మనుశివశంకర్‌(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), తెనాలి నందులపేట మండా వారి వీధికి చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), మారిస్‌పేటకు చెందిన షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గర్తించారు. పట్టణ చెంచుపేటకు చెందిన మైనేని రోహిత్‌ చౌదరి, నందులపేటకు చెందిన తుమ్మలపెంట లక్ష్మీసూర్యప్రకాష్‌, మారిస్‌పేట రెండు గేట్ల ప్రాంతానికి చెందిన గంపల వెంకట శివనాగమణికంఠ కొనుగోలు చేసి సేవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో వీరిని అరెస్ట్‌ చేయగా, ఇదే కేసులో నిందితులైన పట్టణ మారిస్‌పేట మఠం బజారుకు చెందిన షేక్‌ ఫిరోజ్‌, నందులపేటకు చెందిన కోటిసాయి మంజునాథ్‌ పరారీలో ఉన్నారు. వారిని సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. గంజాయి వినియోగంపై డయల్‌ 100/112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ చెప్పారు

Advertisement
 
Advertisement
Advertisement