సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి

పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై తన మాటలు వక్రీకరణ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి నరసరావుపేట టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు టీడీపీ నాయకులు, టీడీపీ ట్రెండ్స్‌, స్వాతిరెడ్డిపై చర్యలకు డిమాండ్‌

నరసరావుపేట రూరల్‌: తన మాటలను వక్రీకరించి సోషల్‌ మీడియాలో తప్పుగా పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం నరసరావుపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బానిస అని వ్యాఖ్యనించడం జరిగిందన్నారు. మా పార్టీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీకి దాసి లాగా షర్మిల పనిచేస్తున్నారని విమర్శించినట్టు వివరించారు. దీనిని దురుద్దేశంతో టీడీపీ నాయకులు, టీడీపీ ట్రెండ్స్‌, స్వాతిరెడ్డి తదితరులు తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా రాజకీయ ప్రతిష్టను దెబ్బతీస్తూ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై తాను చేసిన విమర్శలకు కాంగ్రెస్‌ నాయకులు స్పందించలేదని, టీడీపీ నాయకులు మాత్రం దానిని వక్రీకరించి సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిపై దుష్ప్రచారం చేస్తున్న వారి వివరాలు పోలీసులకు అందజేశామని తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు. దాసి అనే దానికి అర్థాన్ని టీడీపీ నాయకులు తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక చిత్రంలోని వీడియోను ప్రదర్శించి దాసి అంటే సేవకురాలు అని అర్థం అని తెలిపారు. ‘మాకు అధికారం ఉంది మేమే నరుకుతాం’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని, సొంత మామను వెన్నుపోటు పొడిచి చనిపోయే వరకు చంద్రబాబు తీసుకెళ్లాడని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement