అప్రమత్తత నీళ్లు | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తత నీళ్లు

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

అప్రమత్తత నీళ్లు

నివారణకు పాటించాల్సినవి...

ఇంట్లోనే వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు, ఇతర మండే పదార్థాలు అందుబాటులో ఉంచరాదు.

కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పాలి. అజాగ్రత్తగా పారవేయరాదు.

ఐ.ఎస్‌.ఐ ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పరికరాలనే ఉపయోగించాలి.

పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్‌ లోడ్‌ వేయకూడదు. ఎలక్ట్రికల్‌ సాకెట్‌లో దాని కెపాసిటీకి తగిన ప్లగ్‌ను మాత్రమే వాడాలి.

ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులకు బయటకు వెళ్లేటప్పుడు ఎలక్ట్రికల్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయడం ఉత్తమం.

ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే ఆర్పటానికి ఎల్లవేళలా నీటిని ఇంట్లో నిల్వ చేయాలి.

గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్‌ వాల్వ్‌ను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్‌ స్విచ్‌లు ఆన్‌, ఆఫ్‌ చేయరాదు.

స్కూల్స్‌, హాస్పిటల్స్‌, షాపింగ్‌మాల్స్‌లలో ఆర్‌సీసీ లేదా కాంక్రీట్‌ శ్లాబులను మాత్రమే పైకప్పుగా వాడాలి.

ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్‌లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్‌లలో ఆటోమేటిక్‌ స్ప్రింక్లర్‌లు ఉపయోగించాలి.

గోడౌన్‌లలో వస్తువులను నిల్వ ఉంచేటప్పుడు స్టాక్‌లకు మధ్య ఖాళీ స్థలం ఉంచాలి.

గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేసి వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.

కర్మాగారాల్లో పని చేసే కార్మికులకు అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్‌ ఫైర్‌ ఫైటింగ్‌పై శిక్షణ ఇవ్వాలి.

విద్యుత్‌ ప్రమాదాలు జరిగితే మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి.

పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ గోడౌన్‌లలో వాహనదారులు ఇంధనం నింపుకొన్నప్పుడు ఇంజిన్‌ ఆఫ్‌ చేయాలి.

వాహనదారులు ఇంధనం నింపుకొన్న తర్వాత కొద్ది దూరం వెళ్లాక బండి స్టార్ట్‌ చేయాలి.

వాహనదారులుగానీ, పని చేస్తున్న సిబ్బందిగానీ బంకు ఉన్న ప్రదేశంలో బీడీ, సిగరెట్‌ వంటివి కాల్చరాదు. సెల్‌ఫోన్‌ ద్వారా సంభాషించరాదు. నీటి వసతి అందుబాటులో ఉండాలి.

వేసవిలో పొంచి ఉన్న అగ్ని ప్రమాదాల ముప్పు నివారణకు అవగాహనతోపాటు అప్రమత్తత ముఖ్యం జిల్లాలోని అగ్నిమాపక శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత ఈ నెల 14 నుంచి కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు

అవగాహన కల్పిస్తున్నాం

అగ్నిపై చల్లు..

జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న సమయమిది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. వారికి అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు, నివారణపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.

సత్తెనపల్లి: వేసవికాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్రమత్తంగా ఉన్నా కొన్ని సమయాల్లో ప్రాణనష్టంతోపాటు, ఆస్తి నష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పైగా ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వేధిస్తుండటం కలవరపరిచే అంశం. అరకొర సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. లీడింగ్‌ ఫైర్‌మెన్లు, ఫైర్‌ మెన్లు, డ్రైవర్‌ కం ఆపరేటర్లు, సిబ్బంది కొరతతో అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 6 అగ్నిమాపక కేంద్రాలకుగాను 5 చోట్ల అగ్నిమాపక అధికారులు లేకపోవడంతో ఇన్‌చార్జ్‌ లీడింగ్‌ ఫైర్‌ మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో డ్రైవర్‌ కం ఆపరేటర్‌ 18 మందికిగాను కేవలం 12 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఫైర్‌మెన్‌ 54 మంది ఉండాలి. కేవలం 28 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో జిల్లాలో ఒకేసారి రెండు మూడు చోట్ల ప్రమాదాలు జరిగితే నష్ట నివారణ చేయడం వీరికి కష్టసాధ్యంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా 30 మంది హోంగార్డులతోనే విధులు నిర్వహిస్తున్నారు.

పిడుగురాళ్లకు కొత్త వాహనం...

ప్రస్తుతం పల్నాడు జిల్లాలో 6 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ కేంద్రాలన్నీ సింగిల్‌ యూనిట్‌ కావడంతో ఒక్కో కేంద్రానికి ఒక్కో అగ్నిమాపక వాహనం మాత్రమే ఉంటుంది. వినుకొండ, మాచర్ల అగ్నిమాపక కేంద్రాలకు కేటాయించిన అగ్నిమాపక వాహనాలు 15 ఏళ్లు పైబడ్డాయి. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులతో కొత్త అగ్నిమాపక వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత విడుదల చేశారు. వాటిలో జిల్లాకు మంజూరైన కొత్త అగ్నిమాపక వాహనాన్ని పిడుగురాళ్లకు కేటాయించారు.

కొనసాగుతున్న వారోత్సవాలు...

వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటా తరహాలోనే ఏప్రిల్‌ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 1994 ఏప్రిల్‌ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్ని ప్రమాదానికి గుర్తుగా ఏటా జాతీయ అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాలోని 6 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో వారోత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా స్కూళ్లు, కళాశాలలు, వైద్యశాలలు, పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ సిలిండర్‌ గోదాములు, కర్మాగారాల్లో అగ్నిమాపక అధికారులు అవగాహన పెంచడానికి విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.

ఏడేళ్లలో అగ్ని ప్రమాదాల వివరాలు...

ఏడాది ఫోన్‌ ఆస్తి నష్టం మృతుల కాపాడిన

కాల్స్‌ (రూ.) సంఖ్య వారి సంఖ్య

2019–20 536 6,89,55,561 14 04

2020–21 459 14,22,97,460 06 –

2021–22 498 10,52,53,400 04 –

2022–23 464 4,27,30,020 10 04

2023–24 533 56,21,78,000 12 02

2024–25 530 6,62,18,000 13 27

2025–26 3,048 98,76,32,450 85 65

మొత్తం 6,088 197,62,64,891 144 102

అగ్ని ప్రమాదాలను అదుపు చేయడంతోపాటు ప్రమాదాలపై ముందస్తు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన వారికి శిక్షణ ఇస్తున్నాం. వేసవిలో నిర్లక్ష్యంగా స్మోకింగ్‌ చేయడాన్ని నియంత్రించాలి. ఇంట్లో వంట చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

–ఎస్‌ శ్రీధర్‌,

జిల్లా విపత్తుల స్పందన అధికారి, పల్నాడు

Advertisement
 
Advertisement
Advertisement