జేఎన్‌టీయూఎన్‌ కాకాని క్యాంపస్‌కు అటానమస్‌ హోదా | - | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూఎన్‌ కాకాని క్యాంపస్‌కు అటానమస్‌ హోదా

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

నరసరావుపేటరూరల్‌: జేఎన్‌టీయూఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంపస్‌కు అటానమస్‌ హోదా కల్పించనున్నట్టు జేఎన్‌టీయూకె వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ తెలిపారు. కాకానిలోని జేఎన్‌టీయూఎన్‌ కళాశాల ప్రాంగణంలో వార్షికోత్సవ, క్రీడోత్సవాలు శనివారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌, ఎఫెక్ట్రానిక్స్‌ సంస్థ సీఈవో దాసరి రామకృష్ణ, యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.సుబ్బారావు, సీనియర్‌ ప్రొఫెసర్‌ పి.ఉదయభాస్కర్‌లు అతిథులుగా పాల్గొన్నారు. సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ మాట్లాడుతూ జేఎన్‌టీయూఎన్‌ కాకాని క్యాంపస్‌లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి పీజీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. బాలుర, బాలికల వసతి గృహాలు సిద్ధమవుతున్నాయని వివరించారు. పల్నాడు ప్రాంతంలోని ఈ క్యాంపస్‌ విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే యోచనలో ఉందని తెలిపారు. ఇందులో భాగంగా కాకాని క్యాంపస్‌ పూర్తిస్థాయి యూనివర్సిటీగా మారబోతున్నట్టు తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక గణితం, భౌతిక శాస్త్రాలపై పట్టు సాధిస్తే ప్రస్తుత సమాజంలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యా, క్రీడా విభాగాల్లో ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైఎస్‌ కిషోర్‌బాబు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీపీ రాజు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

జేఎన్‌టీయూకే వైస్‌ ఛాన్స్‌లర్‌

ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement