టీడీపీకి ఊడిగం చేస్తున్న షర్మిల | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఊడిగం చేస్తున్న షర్మిల

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

పిడుగురాళ్ల: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. షర్మిల ప్రవర్తనను చూసి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ తానా అంటే షర్మిల తందానా అంటుందని అన్నారు. మహిళా బిల్లుకు మద్దతిస్తామని, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలలో 50 శాతం పెరుగుతాయని స్పష్టమైన హామీ ఇచ్చిన మేరకు ఆ బిల్లులకు వైఎస్సార్‌ సీపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ చెప్పినట్లు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తారని షర్మిల విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. డీలిమిటేషన్‌పైన మీకు అవగాహన ఉందా లేదా అని షర్మిలను ప్రశ్నించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్‌ని, రేవంత్‌రెడ్డిని బండ బూతులు తిట్టిందని, మళ్లీ రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీలోకి వెళ్లి ఇప్పు డు చంద్రబాబునాయుడు కు ఊడిగం చేస్తుందని ఎద్దేవా చేశారు. షర్మిలకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదని, ఏ ఎండకు ఆ గొడుగు పడుతుందన్నారు. బయట ఉండి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే బదులు ఆ పార్టీలో చేరితే సరిపోతుందని హితవు పలికారు. మీరు ఏ భాషను ఉపయోగించి తమ నేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంటున్నారో అదే భాషలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం మానేసి ఎంతో కొంత కాంగ్రెస్‌ పార్టీని బలపరచడానికి పని చేయాలని హితవు పలికారు.

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement