నూజండ్ల: స్థానిక మోడల్ పాఠశాలలో భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. విద్యార్థులు ఆందోళన చెందారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బాత్‌రూమ్‌లోనికి వెళ్లేందుకు తలుపు తీయగా లోపల పెద్ద కొండ చిలువ కనిపించింది. భయాందోళనలకు గురైన విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు తెలుపగా ఆమె స్థానిక పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. కొండ చిలువ పెద్దదిగా ఉండటంతో పంచాయతీ సిబ్బంది చేసేది లేక అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు వచ్చి కొండచిలువను పట్టుకుని, దగ్గరలో ఉన్న అడవిలో వదిలేశారు.


