పోలీస్‌ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

పోలీస్‌ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి గంజాయి కేసులో యువకులకు జైలు గుంటూరు లీగల్‌: మంగళగిరి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన గంజాయి సేవించడం, విక్రయించడం సంబంధిత కేసులపై ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. విజయవాడ విద్యాధరపురానికి చెందిన మండెం ఆనంద్‌బాబుపై నేరం నిర్ధారణ కావడంతో ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా విధించారు. ఇదే కేసులో మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. మరో కేసులో విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఎస్‌.కె. ఇమ్రాన్‌, గంప కిరణ్‌, ఈడే రాహుల్‌, పెయ్య తరుణ్‌కుమార్‌లపై నేరం నిర్ధారణ కావడంతో ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల కారాగార శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ ఒకటవ అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రూ.5వేలు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ తీర్పును మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వి.ఏ.ఎల్‌. సత్యవతి వెలువరించారు. ఈ కేసుల్లో ప్రభుత్వ తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.అశోక్‌ వాణి వాదనలు వినిపించారు.

నగరంపాలెం: జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం పోలీస్‌ స్టాఫ్‌ గ్రీవెన్‌న్స్‌ (ఎస్పీ – సంపర్క్‌) నిర్వహించారు. పోలీస్‌ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌ సిబ్బంది వృత్తిపై నిబద్ధత, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్‌ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్‌ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement