పిన్నెల్లి, కర్నాటిలకు ఎటువంటి సంబంధం లేదు | - | Sakshi
Sakshi News home page

పిన్నెల్లి, కర్నాటిలకు ఎటువంటి సంబంధం లేదు

Mar 16 2026 7:48 AM | Updated on Mar 16 2026 7:48 AM

కర్నాటి టీడీపీ సానుభూతిపరుడు పిన్నెల్లిపై అభాండాలు పిన్నెల్లికి బెయిలు రాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు పల్నాడులో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు దుర్మార్గాలకు పాల్పడేవారిని వదలబోం విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి, యెనుముల మురళీధర్‌రెడ్డి

నరసరావుపేట: పల్నాడులో వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు, దాడులు, అరెస్టులతో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు పార్టీ పరిశీలకులు యెనుముల మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన పిన్నెల్లికి వీరభద్రరరావు అనుచరుడు అంటూ తప్పుడు కథనం రావటం దారుణం అన్నారు. హైకోర్టు అడ్వకేటు హరిబాబు వద్ద అమెరికాలో ఉండే కర్నాటి సతీష్‌ 2018–19లో రూ.2.40 కోట్లు అప్పు తీసుకొని అందులో రూ.1.40కోట్లు చెల్లించాడని, మిగతా చెల్లించాల్సి ఉండగా అది ఇవ్వకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హరిబాబు ఆస్తులు బలవంతంగా రాసిచ్చాడంటూ తప్పుడు అభియోగం మోపి కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో అప్పటి డీఎస్పీ పల్లంరాజు, పిడుగురాళ్ల ఎస్‌ఐ రబ్బానిలపై కూడా కేసు నమోదు చేశారన్నారు. వీరభద్రరావు క్రోసూరు మండలంలో నివాసం ఉంటాడని, అతడికి పిన్నెల్లికి ఎటువంటి సంబంధం లేదన్నారు. పిన్నెల్లి సోదరులకు బెయిలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. బ్రాహ్మణపల్లికి చెందిన మైనార్టీ వర్గీయుడు మాబుపై రంజాన్‌ పర్వదినాల్లో ఆరు అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారని, పీడీయాక్ట్‌ అమలు చేసి జైలుకు పంపారన్నారు. పల్నాడులో ఇప్పటివరకు పది నుంచి 12మందిపై దాడిచేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టి మళ్లీ నడిచేందుకు వీలులేకుండా చేశారన్నారు. మందా సాల్మన్‌ను కొట్టి చంపిన తర్వాత కూడా జూలకల్లు, రామాపురం గ్రామాల్లో మరో ముగ్గురిపై దాడిచేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారన్నారు. పోలీసుల చేతులు కట్టేసి టీడీపీ నాయకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పిన్నెల్లి సోదరులకు బెయిల్‌ వచ్చేందుకు పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు వెళతామని పేర్కొన్నారు. మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై అక్రమకేసులు, దాడులు చేస్తూ వేధిస్తున్నారన్నారు. కమ్మ కులానికి చెందిన వీరభద్రరరావు టీడీపీ సానుభూతిపరుడని అన్నారు. 22 నెలల క్రితం కోర్టు ఆదేశాల మేరకు ఫైల్‌ చేసిన ఈ కేసులో వీరభద్రరరావును అరెస్టు చేస్తే పిన్నెల్లి అనుచరుడు అరెస్టు అంటూ దారుణమైన కథనం రాశారన్నారు. పిన్నెల్లి సోదరులపై 18 అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. టీడీపీ వారిని సొంత పార్టీ వారే చంపితే పిన్నెల్లి సోదరులపై అక్రమంగా కేసు పెట్టి జైలు పాలు చేశారన్నారు. ఇటీవలనే రామాపురం ఎంపీటీసీపై దాడి, వీరారెడ్డిపై హత్యాయత్నం కేసుల్లో కాళ్లు చేతులు విరగ్గొట్టారన్నారు. ఇప్పటివరకు 30 నుంచి 40 మందిపై టీడీపీ వారు దాడులు చేశారన్నారు. దాడిచేసిన వారికి స్టేషన్‌ బెయిలు ఇచ్చి బాధితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బాధ్యులతోపాటు అధికారులను కూడా ఎక్కడున్నా పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement