నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టరేట్‌లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి కచ్చితమైన, పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని వెల్లడించారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్‌ఎస్ జరుగుతుందని, ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చునని సూచించారు.
స్తంబోద్భవం అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్తంబోద్భవం అలంకారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. భక్తులు కనులారా దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో కోగంటి సునీల్‌కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావులు వ్యవహరించారు.


