ఆసుపత్రిలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ నెలల తరబడి నిల్వ ఉన్న మురుగు నీరు దోమల స్వైరవిహారంతో రోగుల అవస్థలు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో మురుగు నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉపశమనం లభించాల్సినచోట అపరిశుభ్ర వాతావరణం స్వాగతం పలకటం ఆందోళన కలిగిస్తుంది. ఉన్నరోగాలకు తోడు కొత్త వ్యాధులు వస్తాయని రోగు లు కలవరపాటు చెందుతున్నారు. దీంతో అక్కడ విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందితో పాటు రోగులు వారి సహాయకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వైద్యశాల్లో రోగులు వినియోగించిన నీరు మురుగు కాల్వ లో పారక ఎక్కడికక్కడే ని లిచిపోతుంది. ఆ నీరు పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతుంది. నెలల తరబ డి మురుగు నిల్వ ఉండ టంతో దోమలు వృద్ధి చెంది స్వైరవిహారం చేస్తున్నా యి. కొన్ని నెలలుగా డ్రైనేజ్ సమస్యపై అనేక ఫిర్యాదులు వచ్చినా అధి కారులు స్పందించిన దాఖలాలు లేవు. సాయంత్రం సమయాల్లో ఉండలేక పోతున్నామని రోగులు వాపోతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో బాధ పడుతూ మరో వైపు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొస్తున్నారు. రోగులు ఉండే గదుల పక్కనే మురుగు కాల్వ ఉండటం అసౌకర్యంగా మారింది. గదుల్లోకి దుర్వాసన వస్తుండటంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో అభివృద్ధి పనులు జరుగుతున్న డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుకు అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


