మాదిపాడు జనసేన కార్యకర్తలు తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ముగ్గురికి అవకాశం ఇస్తామని, తీరా ఒక్కరికే ఇచ్చారని ఆగ్రహం మిగిలిన ఇద్దరినీ తీసుకోకుంటే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని హెచ్చరిక
మాదిపాడు(అచ్చంపేట): సత్తెమ్మతల్లి గుడి బోర్డు సభ్యుల నియామకంలో ఇస్తామన్న మూడు పోస్టులు తమకు ఇవ్వకుండా కేవలం ఒకరికి మాత్రమే అవకాశం కల్పించి, మిగిలిన మొత్తం టీడీపీ సభ్యులు తీసుకున్నారని, తమకు ఇస్తామన్న కోటా ఇవ్వకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని మాదిపాడు జనసేన కార్యకర్తలు గురువారం వీడియో ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ తొలుత అనుకున్నట్లు సత్తెమతల్లి గుడి బోర్డు మెంబర్లుగా జనసేన తరఫున ముగ్గురు పేర్లను సత్తెనపల్లి పార్టీ ఇన్‌చార్జి యర్రంసెట్టి రామకృష్ణ, మాదిపాడు గ్రామ అధ్యక్షుడు కన్నాశ్రీను, ఉపాధ్యక్షుడు వెంకట్రావుల ద్వారా ప్రతిపాదించినట్లు తెలిపారు. అయినప్పటీకీ ఒక్కరికే అవకాశం కల్పించి మిగతా ఇద్దరికీ ఇవ్వలేదన్నారు. అదీగాక ప్రతిపాదించిన వారి పేర్లు కూడా పెట్టలేదన్నారు. ఒప్పందం ప్రకారం ఇస్తామన్న ముగ్గురు సభ్యులకు బోర్డులో అవకాశం కల్పించకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని హెచ్చరించారు.


