జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కమిటీ
వినుకొండ : పల్నాడు జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బ్రహ్మయ్య (నరసరావుపేట), ప్రధాన కార్యదర్శిగా సునీత (ఈపూరు), అసోసియేట్ అధ్యక్షులుగా ఆరిఫ్ (వినుకొండ), కోశాధికారిగా మల్లికార్జున (బొల్లాపల్లి) తదితరులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం వినుకొండ ఏడీఏ రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏడీఏ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.
నరసరావుపేట టౌన్: నరసరావుపేట సబ్ కోర్టు ఏజీపీగా పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది చెన్నుపాటి నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అభినందించారు.


