నేడు సత్రశాలలో కార్తిక పౌర్ణమి కోటిదీపోత్సవం
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా కోటిదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవదాయశాఖ ఈఓ గాదె రామిరెడ్డి, ట్రస్టబోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవస్థానం ప్రధాన అర్చకులు చిట్టేలా శివశర్మ నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి కోటి దీపోత్సవం కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వివిధ స్వామిమాలధారులు, భక్తులు దేవస్థానం ఆవరణలో ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే దీపాలు వెలిగించేందుకు అనుమతించినట్లు తెలిపారు. దేవస్థానం సిబ్బందికి, వలంటీర్లుకు భక్తులందరూ సహకరించాలని వారు కోరారు.


