పల్నాడు
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025 ఏం కొంటాం..ఏం తింటాం..! సత్తెనపల్లి: చిక్కుడు కాయలు చిక్కనంటున్నాయి .. దొండ కాయలు దడ పుట్టిస్తున్నాయి .. ఆకు కూరలు హడలెత్తిస్తున్నాయి .. మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం సెంచరీకి చేరువయ్యాయి. మార్కెట్‌లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు కురవక ముందు రూ.100 పెడితే నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయలు దొరికేవి. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. కిలో చిక్కుడు కాయలు పది రోజుల క్రితం రూ.75 ఉంటే ఇప్పుడు రూ.100 కు చేరింది. వీటితో పాటు ఆకుకూరల ధరలూ పెరిగాయి.
వరుణుడి ప్రతాపంతో మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల నీరు నిలిచి తోటలు కుళ్లిపోయాయి. కూరగా యల దిగుబడి భారీగా తగ్గింది. ఫలితంగా హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చే కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. జిల్లావ్యాప్తంగా 1,275 ఎకరా ల్లో కూరగాయ పంటలు సాగవుతున్నాయి. రిటైల్ మార్కెట్‌తోపాటు ఇంటింటికి తిరిగిఅమ్మే వారి వద్ద కూరగాయలు కొనాలంటేనే భయపడుతున్నారు.
కార్తిక మాసాన .. ధరలు ఆకాశాన కార్తిక మాసం మొదలవడంతో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలో మాల ధరించిన భక్తులతోపా టు ఎక్కువ మంది మాంసాహారం తీసుకోరు. దీనికితోడు గృహప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో క్యారెట్, టమాటా, బీన్స్, చిక్కుడు, వంగ, బీర వంటి కూరగాయలు ధరలు భారీగా పెరిగాయి. ఆకుకూరల ధరలు సైతం బాగా పెరిగాయి. జిల్లా అవసరాలకు సరిప డా కూరగాయలన్నీ దాదాపు ఇతర ప్రాంతాల నుంచే దిగుమతి అవుతున్నాయి. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతూ సామాన్యుల జేబులు లూ టీ చేస్తున్నారు. జిల్లాలో చిలకలూరిపేట, సత్తెనపల్లిలో రైతుబజార్లు ఉన్నాయి. సత్తెనపల్లి రైతుబజార్ మొక్కుబడిగా మారింది. కూరగాయల ధరల పెరుగుదలపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాల్సిన కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఏం కొంటాం..ఏం తింటాం..!
● వారం రోజుల వ్యవధిలో
ధరలో భారీ పెరుగుదల
● వర్షాలతో తోటలు కుళ్లిపోయి
తగ్గిన దిగుబడి
● బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజానీకం
● జిల్లాలో 1,275 ఎకరాల్లో
కూరగాయల సాగు
పట్టణంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 54,483 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 44,533 క్యూసెక్కులు వదులుతున్నారు.
1/3
పల్నాడు
2/3
పల్నాడు
3/3
పల్నాడు