పల్నాటి ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం
కారెంపూడి: ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న పల్నాటి వీరారాధన ఉత్సవాల నిర్వహణపై గురజాల ఆర్డీఓ వి.మురళీకృష్ణ, ఇన్‌చార్జి డీఎస్పీ వెంకట నారాయణ మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలు జరగనున్న కారెంపూడిలో ట్రాఫిక్ సమస్యపై చర్చించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై కారెంపూడి సీఐ టీవీ శ్రీనివాసరావు వివరించారు. మంచినీరు, వైద్యం, పారిశుద్ధ్య పరిరక్షణ ఇతర సౌకర్యాల కల్పనపై కార్యాచరణను కారెంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీడీఓ జి. శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ కసిన్యా నాయక్ వివరించారు. సమావేశంలో పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ, పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ పల్నాడు జిల్లా
కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్
క్రోసూరు: 104 వాహన సేవలు ప్రజలకు పూర్తిగా ఉపయోగపడే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని పల్నాడు జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ గుడిసె చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం సందర్భంగా ఆయన పాల్గొని ఆశ కార్యకర్తలను, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను, ఆరోగ్య కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. 104 వాహన సేవలను ప్రభుత్వం అందించిందని, దానిని పీహెచ్‌సీ ఆశలు, ఆరోగ్య సిబ్బంది ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాహనం ఆ సెంటర్‌లో పెట్టినపుడు ఆశలు ఈ సెంటర్‌లో ఇళ్ల వద్దకు వెళ్లి వాహనం వచ్చిందని, ఆరోగ్యసమస్యలుంటే చూపించుకోవాలని చెప్పాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు జాఫ్రీన్ , మహమ్మద్ షాద్, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, ఆరోగ్య పర్యవేక్షకుడు శివుడు, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరుఎడ్యుకేషన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమగ్ర జీవిత చరిత్ర పుస్తకమైన ‘ఐకానో క్లాస్ట్’ సమీక్ష సభను ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. మంగళవారం గుంటూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బత్తుల విల్సన్ ఆధ్వర్యంలో భారత్ బచావో రాష్ట్ర నాయకుడు కోలా నవజ్యోతి అధ్యక్షతన ఐకానో క్లాస్ట్ పుస్తక సమీక్ష సభ ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో జరగనున్న కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు సమీక్ష చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కిస్ట్ మేధావి రమేష్ పట్నాయక్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు పెనుగొండ లక్ష్మీనారాయణ పాపినేని శివశంకర్, కవి బి.విల్సన్ పాల్గొన్నారు.
పల్నాటి ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం
పల్నాటి ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం


